శంషాబాద్ లో పట్టపగలు గొంతుకోసి హత్య

శంషాబాద్ లో పట్టపగలు గొంతుకోసి హత్య
X

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. మధురానగర్ ప్రాంతంలో ఒక యువకుడిని దుండగులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. నడిరోడ్డుపై జన సంచారం ఉన్న చోటనే చంపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే నిందితులు దొరికే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని ప్రకటించారు.



Tags

Next Story