రంగారెడ్డి జిల్లాలో కారును ఢీకొట్టిన బస్సు... దగ్ధం

రంగారెడ్డి జిల్లాలో కారును ఢీకొట్టిన బస్సు... దగ్ధం
X

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. వాహనదారులు డ్రైవర్ ను సురక్షితంగా కాపాడారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి కారును బస్సు ఢీకొట్టింది. బస్సుకు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్ నుండి శంకర్ పల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. శంకర్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.




Tags

Next Story