మాస్ అవతార్‌లో శర్వానంద్‌..

మాస్ అవతార్‌లో శర్వానంద్‌..
X

చార్మింగ్ స్టార్ శర్వానంద్‌ తొలిసారిగా యాక్షన్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్- ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. బుధవారం మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో శర్వా ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, ఫెరోషస్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకోసం శర్వా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మేషన్ అయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ,

-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌పై ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లను డిజైన్ చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్ -ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Tags

Next Story