అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా.. ఐదుగురికి గాయాలు

X
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చిల్లకూరు ప్రాంతంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు ఉన్నట్టు సమాచారం. గుంటూరు నుండి శబరిమలకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
