ప్రేమపెళ్లి... ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

ప్రేమపెళ్లి... ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
X

అమరావతి: ప్రేమించాడు... ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మచిలీపట్నంలో జయలక్ష్మి, ఫణికుమార్ అనే యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం విజయవాడలోని దుర్గుగుడిలో రహస్యంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. శక్తిగుడి సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. వారం రోజులుగా ఫణికుమార్ ఆమెకు దూరంగా ఉండడంతో బాధితురాలు అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags

Next Story