నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐ వేధింపులు?.. పోలీస్ స్టేషన్లో యువకుడి నిప్పంటించుకుని

పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సుధాకర్ అనే టీ స్టాల్ నిర్వాహకుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సుధాకర్ భీంగల్‌లో కొన్నేళ్లుగా టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి వరకు టీ స్టాల్ నడుపుతున్నాడంటూ ఎస్సై ఫైన్ విధించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అంతేకాకుండా సుధాకర్‌ను తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించేవారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనలో సుధాకర్‌కు సుమారు 90 శాతం కాలిన గాయాలైనట్లు సమాచారం. తొలుత స్థానికంగా చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుధాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చేసిన పోలీసుల వేధింపుల ఆరోపణలపై అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
-
Home
-
Menu
