బాలీవుడ్ దర్శకుడు ఇంటి వద్ద కాల్పులు

బాలీవుడ్ దర్శకుడు ఇంటి వద్ద కాల్పులు
X

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. జుహు ప్రాంతలో ఆదివారం ఉదయం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. స్థానికుల సమాచారం మేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. కాల్పుల సమయంలో రోహిత్ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Tags

Next Story