పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా : శృతి హాసన్

నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మాట్లాడింది. తన జీవితంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లానని, అయితే చివరికి ఆ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చానం ది. జీవితంలో ఒక భాగస్వామి ఉండటం తనకు ఇష్టమే కానీ.. పెళ్లి అనేది ఒక సామాజికమైన కట్టుబాటు మాత్రమేనని, ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, బంధానికి పెళ్లి ముద్ర అవసరం లేదని ఆమె అన్నారు. పెళ్లి కాకపోయినా తల్లి కావడం అనేది ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయమని,
దానికి సమాజం యొక్క ఆమోదం లేదా చట్టబద్ధమైన వివాహబంధం తప్పనిసరి కాదని ఆమె పేర్కొన్నారు. పెళ్లి పేరుతో భారీగా ఖర్చు చేయడం, చట్టపరమైన ప్రక్రియలోకి వెళ్లడం తనకు పెద్దగా నచ్చదని పేర్కొంది.తల్లిగా మారాలన్న కోరిక తనకు ఉందని శృతి హాసన్ స్పష్టం చేసింది. అయితే అందుకు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. పెళ్లి కాకుండానే తన సొంత బిడ్డకు తల్లి కావడం, అవసరమైతే ఒక బిడ్డను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని శృతి హాసన్ తెలిపింది.
Tags
-
Home
-
Menu
