ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ మృతి

SI dies at LB Nagar police station
ఎల్‌బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సంజయ్ సావంత్(58) మృతిచెందాడు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన గత రాత్రి పోలీస్ స్టేషన్‌లో నిద్రించాడు. సంజయ్‌కు గుండెపోటు రావడంతో నిద్రలోనే చనిపోయాడు. మార్నింగ్ నిద్ర నుంచి లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు. నాచారంలో నివాసం ఉంటూ ఎల్‌బి నగర్ పిఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంది. ఎస్‌ఐ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీస్ స్టేషన్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. 1989 లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది . 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. 2020లో ఎఎస్ఐగా 2023లో ఎస్ఐగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యాడు. అతడు గత రెండు సంవత్సరాలుగా ఎల్ బి నగర్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నాడు.
-
Home
-
Menu
