ఎసిబికి చిక్కిన ఎస్‌ఐ రమేష్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లంచం శుక్రవారం ఎసిబి అధికారులకు చిక్కాడు. కొల్లూర్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎం. రమేష్ ఫిర్యాదు దారుడి నుండి రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన నిత్యావసర సరుకుల కేసులో ఫిర్యాదుదారుడి పేరును తొలగించేందుకు ఎస్‌ఐ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. అందులో భాగంగా ఎస్‌ఐ గత నెల 17న రూ.5 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. మిగతా డబ్బుల కోసం ఎస్‌ఐ ఇబ్బందులకు గురి చేయడంతో ఫిర్యాదుదారుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో బాధితుడు శుక్రవారం ఎస్‌ఐకి స్టేషన్‌లోనే రూ.20 వేలు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐని అదుపులోకి తీసుకున్న అధికారులు ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామని అధికారులు తెలిపారు.
-
Home
-
Menu
