నాగర్‌కర్నూల్ లో పిఎస్ లో యువకుడిపై మూత్రం పోసిన ఎస్ఐ?

నాగర్‌కర్నూల్ లో పిఎస్ లో యువకుడిపై మూత్రం పోసిన ఎస్ఐ?
X

తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై శ్రీనివాసరావు తీరు వివాదాస్పదంగా మారింది. ప్రేమ వ్యవహారంలో అవంచకు చెందిన మహేందర్ అనే వ్యక్తిపై ఫిర్యాదు రావడంతో విచారణ పేరుతో పిలిచి మహేందర్‌ను ఎస్సై శ్రీనివాసరావు చితకబాదారు. మహేందర్ దాహం వేస్తుందని పోలీసులను అడగడంతో తనపై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపణ చేశాడు. ఎస్సై శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు సదరు యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశాడు. ఎస్సై శ్రీనివాస్ రావు పై ఆరోపణలకు పూర్తిస్థాయి విచారణకు డిఎస్ పి ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూల్ సిఐ అశోక్ రెడ్డి కి విచారణ బాధ్యతలు అప్పగించారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్ పి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

Tags

Next Story