సిద్దిపేటలో భార్య గొంతుకోసి... కుమార్తెపై రోకలి బండతో దాడి.. గొంతుకోసుకున్న భర్త

సిద్దిపేటలో భార్య గొంతుకోసి... కుమార్తెపై రోకలి బండతో దాడి.. గొంతుకోసుకున్న భర్త
X

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. భర్త తన భార్య గొంతు కోసి కూతురును రోకలి బండతో దాడి చేసి అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదర్శనగర్‌లో ఎల్లయ్య, శ్రీలత(40) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. గత కొన్ని రోజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భర కత్తి తీసుకొని భార్య గొంతు కోశాడు. అనంతరం కుమార్తెను రోకలి బండతో దాడి చేసి అనంతరం కత్తితో గొంతుకోసుకున్నాడు. ఇంట్లో నుంచి అరుపులు కేకలు వినపడడంతో వెంటనే ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story