భూ తగాదాలు.. కాంగ్రెస్ నేత దారుణ హత్య

X
దుబ్బాక: సిద్ధపేటలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాల నేపథ్యంలో బాల్ రెడ్డి(50) అనే వ్యక్తిని దాయాదులు హత్య చేశారు. దుబ్బాక పురపాలికలోని చేల్లాపూర్ వార్డు శివారులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. చేల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్‌రెడ్డిని అదే గ్రామానికి చెందిన దాయాదులు భూ తగాదాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గొంతుకోసం చంపారు. అనంతరం నిందితులు తల్లి, కొడుకు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం హత్యకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని ఎసిపి తెలిపారు.
Next Story
-
Home
-
Menu
