సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తాం: రేవంత్ రెడ్డి

Siddipet MLA minister
హైదరాబాద్: ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం కాదు అని రైతుల కోసమని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ఎప్పుడు వివక్ష చూపలేదని, తనది వివక్ష చూపే తత్వం కాదు అని స్పష్టం చేశారు. వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడంగల్ కు ఎన్ని నిధులు ఇచ్చామో చర్చిద్దాం రండి అని హరీష్ రావుకు రేవంత్ సవాల్ విసిరారు. తాము పేదల కోసం పని చేస్తామని, రాజకీయ నాయకుల కోసం కాదు అని పేర్కొన్నారు. 2029లో మళ్లీ అధికారం మాదేనని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత మా మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నామన్నారు. పదేళ్లు ప్రజలు బిఆర్ఎస్ వాళ్లను ఆశీర్వదించారని, ఇప్పుడు పదేళ్లు ప్రజలు కాంగ్రసోళ్లను ఆశీర్వదిస్తారన్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి శాసన సభ్యులుగా ఉంటున్నారని, ఇతరులకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. మార్పు చేసి చూడాలని మంచి జరుగుతుందో లేదో చూస్తామన్నారు. సిద్దిపేట ప్రజలు అనుకుంటే ఏదీ ఆగదని, మళ్లీ 2029 లో వస్తామని సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తామన్నారు. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం తమకు లేదని, 119 నియోజకవర్గాలతో సమానంగా చూస్తామన్నారు.
-
Home
-
Menu
