పౌల్ట్రీ పరిశ్రమలకు సింగిల్ విండో విధానం: సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు త్వరగా ఇచ్చేందుకు సింగిల్ విండో విధానం తీసుకొస్తామని, రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడుతూ.. అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగుతాయని ,పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న దాణా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై 48 గంటల్లో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో 18 ఏళ్లుగా పౌల్ట్రీ మీట్ నిర్వహించడం విశేషమని అన్నారు. ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇస్తే పరిశీలిస్తామని సిఎం వెల్లడించారు.
Tags
-
Home
-
Menu
