మేనల్లుడితో అక్రమ సంబంధం... అత్తను చంపిన అక్కాచెల్లెళ్లు

మేనల్లుడితో అక్రమ సంబంధం... అత్తను చంపిన అక్కాచెల్లెళ్లు
X

మన తెలంగాణ - క్రైమ్ డెస్క్: మేనల్లుడితో అత్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమెను అతడి అక్కాచెల్లెలు హత్య చేసిన సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హకుబెన్ తన మేనల్లుడు రవితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని ఆరోపిస్తూ అతడి సోదరీమణులు రాధా, మధు గొడవలకు దిగేవారు. రవితో సంబంధాన్ని ముగించాలని వారు కోరినా హకుబెన్ అంగీకరించకపోవడంతో ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాధా, మధు అనే అక్కాచెల్లెలు జునాగఢ్ నుంచి హకుబెన్‌ను జెట్‌పూర్‌కు పిలిపించారు. విషపదార్థం కలిపిన సోడా ఆమెకు ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరో ఇద్దరుతో కలిసి హత్య చేశారు. హకుబెన్ మృతిపై ఆమె సోదరుడు అరవింద్‌భాయ్ వాఘేలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాధ, మధు, లక్ష్మణ్, భూపత్‌భాయ్ పోపట్‌భాయ్ వాఘేలాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలు హకుబెన్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags

Next Story