తూర్పుగోదావరిలో భార్య, అత్తను నరికి చంపి

X
Navi Mumbai Maharashtra
అమరావతి: కుటుంబంలో గొడవలు జరగడంతో భార్య, అత్తను అల్లుడు కత్తితో నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొబ్బిలంక అనే గ్రామంలో సోడదాసి సీతారామరాజు, లత అనే దంపతులు నివసిస్తున్నారు. గతంలో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో లత తన తల్లి గారింటికి వెళ్లిపోయింది. సోమవారం అర్థరాత్రి అల్లుడు సీతారామరాజు అత్తింటికి వెళ్లి గొడవకు దిగాడు. ఆగ్రహంతో అత్త, కూతురును కత్తితో నరికి చంపాడు. భార్యపై అనుమానంతో ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గతంలో హత్య కేసులో జైలుకు వెళ్లినట్లు సమాచారం.
Next Story
-
Home
-
Menu
