అద్దె కట్టలేక రోడ్డున పడ్డ కుటుంబం

X
ఇంటి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి కూతురు మానసలు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బట్టల దుకాణంలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పని కోల్పోవడంతో గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అద్దె కట్టలేక ఇల్లు వదిలి మండల పరిషత్ కార్యాలయం ముందుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కరువైందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Next Story
-
Home
-
Menu
