వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 విద్యార్థులు మృతి

X
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు చెరువు వద్దకు వెళ్లారు. నీటి లోతు తెలియక చెరువులోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆరుగురు బాలురు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని నీటిలో గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
