బావిలోపడి ఆరేళ్ల బాలుడి దుర్మరణం

బావిలోపడి ఆరేళ్ల బాలుడి దుర్మరణం
X

గాలిపటం కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ అన్నదమ్ములు బావిలో పడిన ఘటనలో తమ్ముడు మృతి చెందాడు. అన్న ప్రాణాలతో బయటపడిన ఘటన మర్పల్లి మండల పరిధిలోని కొంషెట్‌పల్లిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తు వివరాల ప్రకారం కొంషెట్‌పల్లికి చెందిన సిజావద్దీన్ అమీరా బేగం దంపతులు కూలి చేసుకుని జీవిస్తున్నారు. వీరికి కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. సిజాహుద్దీన్ తల్లి పక్షవాతంతో బాధపడుతున్న నేపథ్యంలో.. మందుల కోసం కర్ణాటకలోని గుర్మత్కల్ గ్రామానికి వెళ్లాడు. ఇంటివద్ద కుమార్తెను, పెద్ద కొడుకు సైఫాన్, చిన్న కొడుకు సాయిల్ (6) ఇంటివద్దే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ గ్రామంలోనే ఉర్దూ పాఠశాలలో చదువుతున్నారు.

శనివారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్ద ఆడుకుంటూ.. గ్రామంలోని కరణం పంతులు పొలాలవైపు వెళ్లారు. బావి సమీపంలో గాలిపటం కనిపించడంతో.. ఎగురవేసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ తమ్ముడు సాయిల్ బావిలో పడిపోయారు. తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్న సైఫాన్ సైతం బావిలో పడిపోయాడు. అది గమనించిన సమీపంలోని ఓ మహిళ.. పక్క పొలంలో ఉపాధి కూలీలకు సమాచారం అందించడంతో కూలీలు అన్న సైఫాన్‌ను కాపాడారు. అప్పటికే తమ్ముడు సాహిల్ నీటిలో మునిగిపోయాడు. దీంతో గ్రామస్తులు బావిలోని నీటిని మోటార్లద్వారా తోడి గాలించినా.. సాహిల్ మృతదేహం ఆచూకీ లభించలేదు. సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

Tags

Next Story