జగిత్యాలలో చిన్న గొడవ.. ప్రాణం తీసుకున్న ప్రేమికులు

జగిత్యాల: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మధ్య చిన్న గొడవ జరగడంతో భార్య దసరా రోజు ఆత్మహత్య చేసుకోగా భర్త దీపావళి రోజున చనిపోయాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎర్దండి గ్రామంలో అల్లెపు సంతోష్(25) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గంగోత్రిని గాఢంగా ప్రేమించాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి సెప్టెంబర్ 26న ప్రేమపెళ్లి చేసుకున్నారు. దసరా రోజున భార్యతో కలిసి సంతోష్ అత్తారింటికి వెళ్లాడు. కూరలో కారం ఎక్కువ కావడంతో భార్యను మందలించాడు. అత్తింట్లో ఉరేసుకొని గంగోత్రి తనువు చాలించింది. ప్రియురాలు చనిపోయినప్పటి నుంచి సంతోష్ మనోవేదనకు గురవుతున్నాడు. మానసికంగా కుంగిపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే తన అక్క దగ్గరకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
-
Home
-
Menu
