ఆర్‌టిసి బస్సులో అకస్మాత్తుగా పొగలు

X
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ నుండి కర్నూలుకు బయలుదేరిన బస్సు మానవపాడు మండలం మద్దూరు స్టేజ్ సమీపంలో అయిజ నుండి కర్నూలు వెళ్ళే బస్సులో టైర్లో పొగలు వ్యాపించాయి. దానిని గమనించిన ప్రయాణికులు అరుపులు, కేకలతో బస్సు కిటికిల నుంచి కిందికి దిగి ప్రయాణికులు పారిపోయారు. ఆర్టీసీ డ్రైవర్ చాక చక్యంతో బస్సును ఆపి, పొగలను నియంత్రించే ప్రయత్నాలు చేశారు. ఓవర్ లోడ్‌తోనే ఈ సంఘటన జరిగిందని డ్రైవర్ తెలిపారు. వద్దంటే కూడా ప్రయాణికులు ఎక్కుతున్నారని తెలిపారు. బస్సులు లేక పోవడంతోనే నిండుగా ఉన్న బస్సులను ఎక్కుతుండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఎవరికి ఏలాంటి ప్రమాదం జరగక పోవడముతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు
Next Story
-
Home
-
Menu
