కాటు వేయడంతో పాముతో ఆస్పత్రికి చేరుకున్న యువకుడు

కాటు వేయడంతో పాముతో ఆస్పత్రికి చేరుకున్న యువకుడు
X

అమరావతి: యువకుడిని పాము కరవడంతో దానిని చంపాడు. అనంతరం పాము కళేబరంతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవ్వూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... నెల్లూరు శివారులో ఓ హోటల్ లో యువకుడు భోజనం చేస్తుండగా రక్తపింజరి కాటు వేసింది. వెంటనే అప్రమత్తమై యువకుడు పామును చంపేశాడు. అనంతరం పాము కళేబరంతో ఆస్పత్రికి చేరుకున్నాడు. పామును చూసి సిబ్బంది భయంతో వణికిపోయారు. వైద్యు సిబ్బంది అతడికి విరుగుడు ఇంజక్షన్ వేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని మరో ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story