పోచారంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

X
ఘట్‌కేసర్: కుటుంబ కలహాల కారణంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సంతోష(26) నివాసం ఉంటున్నారు. పోచారంలో ఓ ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.
Tags
Next Story
-
Home
-
Menu
