ప్రియురాలిని చంపేసి.... రాత్రంతా మృతదేహం పక్కనే

Software Engineer Beats Live-in Partner
X

పుణె: మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో తరచూ గొడపడుతున్న ప్రియురాలిని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య చేసాడు. వార్ధా జిల్లాకు చెందిన కోమల్ దహాలే, బుల్దానాకు చెందిన శుభం కల్బాండే ఇద్దరూ హింజేవాడిలోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆదివారం రాత్రి కలిసి భోజనం చేసి పీజీకి తిరిగొచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగ్రహానికి గురైన శుభం కోమల్‌పై పిడిగుద్దులతో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రాత్రంతా మృతదేహం పక్కనే ఉన్న నిద్రపోయాడు. సోమవారం ఉదయం 6.30 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్ కోరాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Next Story