అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
X

న్యూయార్క్: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ మృతి చెందాడు. వరంగల్‌లోని జితేందర్ అనే వ్యాపార వేత్తకు రాకేశ్(40) అనే కుమారుడు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తున్నాడు. రాకేశ్ తన భార్య తేజస్విని ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం రాకేశ్‌కు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. దీంతో వరంగల్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags

Next Story