మోత్కూర్ లో గుండెపోటుతో తండ్రి మృతి.... పదో తరగతి పరీక్షలకు హాజరైన కుమారుడు

Son attended tenth exams while father dead
X

Son attended tenth exams while father dead 

మోత్కూర్: ఇంట్లో తండ్రి చనిపోయి ఉన్నాడు.. దు:ఖాన్ని దిగమింగుకొని కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది. మోత్కూరు చెందిన కూరెళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి గుండాల మండలం వస్తాకొండూరులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. మృతుడి కుమారుడు హర్షవర్థన్ బాధను దిగమింగుకొని పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఎల్లయ్య కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మోత్కూరులో విషాదచాయలు అలుముకున్నాయి.


Tags

Next Story