నిజామాబాద్ లో దారుణం.. కుమారుడిని నరికి చంపిన తండ్రి

నిజామాబాద్ లో దారుణం.. కుమారుడిని నరికి చంపిన తండ్రి
X

నిజామాబాద్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. చెడు అలవాట్లకు బానిసైన తన కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగొల్ల కిషన్ అనే వ్యక్తి.. గంజాయికి అలవాడు పడిన తన కొడుకును కత్తితో పొడిచి చంపాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కిషన్ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుమారుడిని చంపిన అనంతరం కిషన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags

Next Story