కరెంటు షాక్‌తో అత్తను చంపిన అల్లుడు

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట పంచాయతీ మంగళి తండా (బడి తండా)లో సోమవారం రాత్రి అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అల్లుడే కాల యముడిగా మారి, అత్తకు విద్యుత్ షాక్ పెట్టి హత మార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం లేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... భద్రాద్రి కొత్తగుడెం జిల్లా జులూరుపాడుకు చెందిన దారావత్ కౌసల్య (50) తన అల్లుడైన రాజేష్ పిలుపు మేరకు సీతంపేట మంగళి తండా (బడి తండా) వారి ఇంటిలోకి వచ్చారు. అయితే సోమవారం రాత్రి సమయంలో రాజేష్ ఆమెకు కరెంటు షాక్ ఇచ్చి అతి కిరాతకంగా చంపాడు. సొంత భార్య తల్లిదండ్రులు అని కూడ చూడకుండా వారిపై ఈ ఘాతుకానికి పాల్పాడ్డారు. ఇందులో అత్త మరణించగా మామ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆయనను ఆస్పత్రికి తరలించాలని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
-
Home
-
Menu
