తల్లి గొంతు కోసిన కొడుకు.. ఎందుకంటే..?

హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని 47వ డివిజన్ బాలాజీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది.అక్రమ సంబందం వద్దంటూ తల్లిని మందలించిన కొడుకు ఆమె వినక పోవడంతో గొంతు కోసి హత్య చేసిన ఘటన గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ నగర్‌కు చెందిన నాగుల సుధాకర్, ఉదయశ్రీ (40) దంపతులకు కుమారుడు దొరబాబు(21),కుమార్తె ఉన్నారు. మంచిర్యాల చెందిన ఉదయశ్రీ తో నాగుల సుధాకర్‌కు దాదాపు 22 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. కుమారుడు బీబీఎం, కూతురు పదవ తరగతి చదువుతుంది. సుధాకర్ ప్రైవేటు కోచ్ అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఉదయశ్రీ ఇంటి వద్దె ఉంటు రీల్స్ చేస్తుండేది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.ఆ వ్యక్తి అప్పుడప్పుడు బాలాజీనగర్ వచ్చి వెళ్లెవాడు. ఇద్దరు వేరే కాపురం పెట్టుకుందామని అనుకున్నారు.
గణపతి నవరాత్రులు అయిపోవడంతో ఇంట్లో అందరికి చెప్పి బయటకు రమ్మని ప్రియుడు చెప్పడంతో ఉదయశ్రీ అదే విధంగా ఇంట్లో వారికి చెప్పి గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కుమారుడు దొరబాబు తల్లిని బెడ్‌రూంలోకి తీసుకెళ్లి మాట్లాడు. సంబంధాన్ని కొనసాగించవద్దని నచ్చజెప్పినా తల్లి వినకపోవడంతో కోపోద్రికుడైన దొరబాబు అక్కడే ఉన్న కత్తితో తల్లి గొంతు కొసాడు. అనంతరం తల్లిని హత్య చేసినట్లు కుటుంబసభ్యులకు చెప్పి అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కాజీపేట సిఐ శ్యాంసుందర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సెంట్రల్ డీసీపీ దార కవిత,కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి హత్య జరిగిన తీరును పరిశీలిచారు. ఫింగర్ ప్రింట్స్ బృందం ఆధారాలను సేకరించింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
Home
-
Menu
