IND vs SA T20: టాస్ గెలిచిన దక్షిణాప్రికా.. భారత్ జట్టు ఇదే

IND vs SA T20: టాస్ గెలిచిన దక్షిణాప్రికా.. భారత్ జట్టు ఇదే
X

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా తొలి టీ20లో భారత్‌-సౌతాఫ్రికా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకోలేదు. ఎప్పటి లాగే అభిషేక్ శర్మ, గిల్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. చాలా రోజుల తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్ కు బదులు వికెట్ కీపర్ గా జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. కాగా, వన్డే సిరీస్ విజయంతో జోష్ లో ఉన్న భారత జట్టు.. ఈ మ్యాచ్ లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, దక్షిణాఫ్రికా జట్టు కూడా తొలి టీ20లో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది.

ఇరు జట్ల వివరాలు:

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

Tags

Next Story