సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
X
ప్రయాణీకుల అదనపు రద్దీని ఎదుర్కోడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో

ప్రయాణీకుల అదనపు రద్దీని ఎదుర్కోడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రతి మంగళవారం సికింద్రాబాద్- అనకాపల్లి (07059), ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి మంగళవారం అనకాపల్లిసికిందరాబాద్ (07060 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూర్, ఆకివీవు, భీమవరం టౌన్, తనుకు, రాజమండ్రి, సామల్‌కోట్, అన్నవరం, తుని, ఎలమంచలి స్టేషన్‌లలో ఆగుతాయి.


బీదర్‌అజ్నిబీదర్ మధ్య ప్రత్యేక రైళ్లు

ధమ్మ ప్రవర్తన్ దివస్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్లే బీదర్‌అజ్నిబీదర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అక్టోబర్ 1న బీదర్‌అజ్ని (07083), అక్టోబర్ 2న అజ్నిబీదర్ (07084) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్లే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, సికిందరాబాద్, చర్లపల్లి, జనగావ్, కాజిపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, సిర్‌పూర్ కాగజ్‌నగర్, బాల్హార్షా స్టేషన్‌లలో ఆగుతాయి.

Tags

Next Story