పవర్‌ప్లేలో అదరగొట్టారు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

పవర్‌ప్లేలో అదరగొట్టారు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..
X

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెకెఆర్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరదపారించారు. వైభవ్ వేసిన రెండో ఓవర్‌లో హెడ్ 20 పరుగులు రాబట్టగా.. వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో అభిషేక్ 25 పరుగులు స్కోర్ చేశాడు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్(46) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఫలితంగా పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ దూకుడుగానే ఆడాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి పరుగులు రాబట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ(47), ఇషాన్ కిషన్(14) ఉన్నారు.

Tags

Next Story