శ్రీసత్యసాయి జిల్లాలో బాలికపై తండ్రి, మేనమామ అత్యాచారం

X
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఎనిమిదో తరగతి బాలికపై కన్నతండ్రి, మేనమామ అత్యాచారం చేశాడు. ఓ గ్రామంలో బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక అనారోగ్యానికి గురకావడంతో ఉపాధ్యాయురాలు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు తనపై తండ్రి, మేనమామ లైంగిక దాడి చేశారని బాలిక చెప్పడంతో ఉపాధ్యాయురాలు షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో విషయంపై జిల్లా విద్యాధికారి కూడా విచారణ చేసినట్టు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఇంటికి తీసుకెళ్లారని ఉపాధ్యాయులు వివరించారు.
Tags
Next Story
-
Home
-
Menu
