అయ్యప్పని దర్శించుకొని వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు భక్తులు మృతి

X
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృత్యవాత పడ్డారు. పలాస మండలం వీర రామదచంద్ర పురం, పెదంచెలకు చెందిన ఆరుగురు శబరిమలలో అయ్యప్పను దర్శించుకొని కారులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో రామేశ్వరం సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ (24), సాయి (25) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ గౌతు శిరీష దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Next Story
-
Home
-
Menu
