ట్రేడింగ్ పేరిట భారీ మోసం... కిలాడీ వలకు చిక్కిన వ్యాపారి

హైదరాబాద్: స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మహిళలు ఓ వ్యాపారిని రూ.4.89 కోట్లు మోసం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన వ్యాపారి (41) స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని అంటూ ఇద్దరు మహిళలు మాయమాటలతో రూ.4.89 కోట్లు స్టాక్ మార్కెట్ లో పెట్టించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి ప్రాంతానికి చెందిన లావణ్య దాసరి,అర్పితగా సదరు వ్యాపారిని పరిచయం చేసుకున్నారు. మొదట ఫోన్‌పే ద్వారా 50,000 పెట్టుబడి పెట్టాలని సూచించారు. లాభంతో వచ్చిందని సదరు వ్యాపారి చెప్పడంతో నకిలీ ప్రూఫ్ ను చూపించారు. ఆ తర్వాత మొత్తం రూ. 4.89 కోట్ల రూపాయాలను బదిలీ చేయించుకున్నారు. ఖాతాలో 16 కోట్లు రూపాయలు లాభం వచ్చిందని చూపించారు, చివరగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పేరిట రూ. 2.5 కోట్లు అడిగారు. దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
