తవ్వకాల్లో బయటపడిన దుర్గామాత విగ్రహం

stone sculpture of Goddess Durga
ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సమీపంలో తవ్వకాల్లో సింహవాహిని రూపంలో ఉన్న దుర్గామాత విగ్రహం బయటపడింది. దుర్గామాత విగ్రహాన్ని శాలపల్లి గ్రామ ప్రజలు మంగళవారం ఉదయం తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ బి టైప్ గేట్ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద జరిపిన మినీ చెరువు నిర్మాణం పనుల్లో అష్టభుజాలతో సింహవాహిని రూపంలో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే హిందు వాహిని బిజెపి నాయకులు వెళ్లి పూజలు నిర్వహించారు. ఎన్టీపీసీకి చెందిన సోలార్ ప్లాంట్ పరిధిలో అమ్మవారి విగ్రహం లభించడంతో మంగళవారం ఉదయం హెచ్‌ఆర్ ఎజిఎం బిజయ్ కుమార్ సిక్దర్, హెచ్‌ఆర్ అధికారులు, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెళ్లి దుర్గామాత విగ్రహాన్ని పరిశీలించారు.
దుర్గామాత మందిరాన్ని నిర్మించాలని హిందూ వాహిని, బిజెపి నాయకుల డిమాండ్
ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సమీపంలో లభించిన దుర్గామాత రాతి విగ్రహం సమీపంలోనే మందిరాన్ని నిర్మించి ఇవ్వాలని హిందూ వాహిని నాయకులు, బిజెపి నాయకులు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరారు. మంగళవారం ఉదయం దుర్గామాత విగ్రహం లభించిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం హిందు వాహిని నాయకులు ఇసంపల్లి వెంకన్న, కొండపర్తి సంజీవ్, కాంతుల సంతోష్ రెడ్డి, మిట్టపల్లి సతీష్, బిజెపి రామగుండం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి, గాండ్ల ధర్మపురి స్థానిక విలేకరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు రమేష్, తన్నీరు రమేష్, బండి సమ్మయ్య, గోలివాడ శ్రీకాంత్, ఇదినూరు వెంకటేష్, మేకల సదానందం, రవీందర్, వంశీతోపాటు పలువురు పాల్గొన్నారు.
-
Home
-
Menu
