వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్య

వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్య
X

బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సర్దేవర్ అమృత (17) ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని బాన్సువాడ పట్టణంలోని ఎస్సి బాలికల వసతి గృహంలో ఉంటూ విద్య అభ్యసిస్తుంది. బుధవారం ఉదయం విద్యార్థులు అందరూ కళాశాలకు వెళ్లిన అనంతరం వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. వసతి గృహాన్ని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి,

వసతి గృహం జిల్లా అధికారి వెంకటేశం వసతి గృహాన్ని సందర్శించారు. ఘటనపై వసతి గృహం జిల్లా అధికారి వెంకటేశం మాట్లాడుతూ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వసతి గృహాల్లో వరుస సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా, కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు షేక్ జుబేర్, విద్యార్థి సంఘాల నాయకులు, తదితరులు ధర్నా రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

Tags

Next Story