హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

X
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష (16) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురైన వర్ష సోమవారం సాయంత్రం హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు .
Next Story
-
Home
-
Menu
