షాద్‌నగర్‌లో విషాదం: మెట్ల పైనుంచి పడి చిన్నారి మృతి

షాద్‌నగర్‌లో విషాదం: మెట్ల పైనుంచి పడి చిన్నారి మృతి
X

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో మెట్ల పైనుంచి జారి పడి ఓ చిన్నారి మృతి చెందింది. నాలుగో తరగతి చదువుతోన్న వర్ణిక (9) గురువారం మెట్లు దిగుతూ ఒక్కసారిగా పైనుంచి పడిపోయింది. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో స్కూల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వర్ణిక శుక్రవారం మృతి చెందింది.

Tags

Next Story