బాన్సువాడలో గురుకుల ఆవరణలో ఆటోలో నుంచి పడి విద్యార్థిని మృతి... వీడియో వైరల్

బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గురుకులంలో ఆటోలో నుంచి విద్యార్థిని కింద పడి మృతి చెందింది. ఆదివారం సాయంత్రం సమయంలో గురుకుల ఆవరణలో ఆటోలో నుంచి బెంచీలను తీసుకొని వెళ్తుండగా వాహనంలో నుంచి విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం అయిందని, బాలికలు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఇంటి ఫంక్షన్ కోసం ఫర్నిచర్ తరలిస్తుండగా ఆటో నుంచి సంగీత అనే విద్యార్థిని కిందపడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ముగ్గురు విద్యార్థులు ఆటోలో నుంచి పడినట్టు వీడియో వైరల్ అవుతోంది. సంఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయని, తల్లిదండ్రులు ఆరోపించారు. ఆసుపత్రికి చేరుకొని కంటతడి పెట్టుకున్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, సిఐ శ్రీధర్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతి చెందిన విద్యార్థిని సంగీత మద్నూర్ మండలం కోడి చీర గ్రామానికి చెందినిదిగా గుర్తించారు. ప్రిన్సిపాల్ ఇంచార్జీ సొంత పనుల కోసం విద్యార్థులతో ఎందుకు పని చేయించుకుంటున్నారని కుటుంబీకులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
-
Home
-
Menu
