సిద్దిపేటలోని కస్తూర్బాలో విద్యార్థిని మృతి

శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత హాస్టల్ లో పడిపోయిన విద్యార్థిని..
ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లిన స్కూల్ టీచర్లు..
అప్పటికే మరణించినట్లు తెలిపిన డాక్టర్లు..
మన తెలంగాణ/ సిద్దిపేట అర్బన్: మిట్టపల్లి కస్తూర్బా పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మరణించిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుర్రం తిరుపతి రెడ్డి, శ్రావణి దంపతుల కుమార్తెలు వర్షా, హర్షిని లు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని కస్తూర్బా పాఠశాలలో చదువుతున్నారు. వర్షా తొమ్మిదో తరగతి చదువుతుండగా, హర్షిని (11) ఏడో తరగతి చదువుతోంది. కాగా రోజులాగే రాత్రి భోజనం చేసిన అనంతరం తోటి స్టూడెంట్స్ తో కలిసి హాస్టల్లో ఆడుకుంటున్న హర్షిణి ఒక్కసారిగా పడిపోవడంతో, తోటి స్టూడెంట్స్ టీచర్లకు తెలపడంతో వారు హుటాహుటిన సురభి మెడికల్ కాలేజ్ కు తరలించగా, అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందన్నారు. వెంటనే స్కూల్ టీచర్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు8. అనంతరం పాప మృతదేహాన్ని శవ పరీక్ష కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాప మృతి పై అనుమానం లేదని, తనకు ఎలాంటి హెల్త్ ఇస్యూ స్ లేవని, రెండు సంవత్సరాల క్రితం ఆమెను స్కూల్ లో జాయిన్ చేసినట్లు పాప తండ్రి తిరుపతి రెడ్డి తెలిపారు. సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు పంచనామా నిర్వహించారు.
Tags
-
Home
-
Menu
