క్లాస్‌రూమ్‌లోనే సహవిద్యార్థినిపై కాల్పులు

క్లాస్‌రూమ్‌లోనే సహవిద్యార్థినిపై కాల్పులు
X

చండీగఢ్: పంజాబ్‌లో తార్న్ తరణ్ జిల్లాలో సోమవారం ఓ విద్యార్థి క్లాస్ రూమ్ లో తనతోటి విద్యార్థినిపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఆమెను చంపి, తను కూడా అదే తుపాకీతో కాల్చుకున్నాడు. అక్కడి విద్యార్థులంతా ఈ సంఘటనకు భయభ్రాంతులయ్యారు. తర్న్ తరన్ జిల్లాకు చెందిన ప్రిన్స్‌రాజ్, సందీప్ కౌర్‌లు ఉస్మా గ్రామంలోని లా కాలేజీతో ఫస్ట్ ఇయర్ లా చదువుతున్నారు. కౌర్‌పై రాజ్ ఎందుకో పగ పెంచుకున్నాడు.

సోమవారం ఉదయం కాలేజీకి రాగానే తనవెంట తెచ్చుకున్న తుపాకీతో క్లాస్ రూమ్‌లోనే కౌర్‌పై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో కౌర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కౌర్ చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత రాజ్ తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన రాజ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. కౌర్‌ను రాజ్ ఎందుకు హత్య చేశాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story