ఎగ్జామ్ హాల్ లో స్మార్ట్ ఫోన్ తో కాపీయింగ్.... వీడియో వైరల్

students coping with mobile phones during exam
పరీక్షా హాల్లో మొబైల్ ఫోన్ల వినియోగం
హెడ్‌మిస్ట్రెస్‌కు షోకాజ్ నోటీసు.. జీతం నిలిపివేత
పాట్నా: బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్ మొఖ్తియార్‌పూర్‌లోని అప్‌గ్రేడెడ్ సెకండరీ స్కూల్‌లో హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ సందర్భంగా విద్యార్థులు మొబైల్ ఫోన్ తో కాపీయింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షా హాల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లతో ప్రశ్నపత్రాలు రాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ 22న ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. వైరల్ వీడియోలో పలువురు విద్యార్థులు పరీక్ష రాస్తూనే మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. అయితే పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్ లేకపోవడంతో విద్యార్థులు ఫోన్ ను ఉపయోగించి కాపీయింగ్ పాల్పడ్డారు.
వీడియో వైరల్ కావడంతో బెగుసరాయ్ జిల్లా విద్యాశాఖ అధికారి మనోజ్ కుమార్ స్పందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లూసీ కుమారికి షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, పరీక్షల సమయంలో ఇన్విజిలేషన్ బాధ్యతలు ఎవరు నిర్వహించారో, నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉపాధ్యాయుల కొరతే కారణమా?
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లూసీ కుమారి మాట్లాడుతూ.. ఒకేసారి 9, 10, 11, 12 తరగతులకు పరీక్షలు జరుగుతుండటంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని తెలిపారు. ప్లస్ టూ విభాగంలో కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయులు హాజరు నమోదు, ఇతర పరీక్షా సంబంధిత పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో విద్యార్థి మొబైల్ ఫోన్ బయటకు తీసి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. పరీక్షా హాల్లోకి విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని, ఈ ఘటనలో పాఠశాల తరఫున తప్పిదం జరిగిందని లూసీ అంగీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
Tags
-
Home
-
Menu
