విద్యార్థులకు నైపుణ్యాలు అవసరం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరమని భావించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసం టాటా టెక్నాలజీస్ తో చర్చలు జరిపామని అన్నారు. మల్లేపల్లి ఐటిఐ ప్రాంగణంలో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న65 ఎటిసిలను సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటిఐలుగా ప్రభుత్వం తీర్చిదిద్దిందని, రాష్ట్రంలో స్కిల్స్ ఉన్న ఉద్యోగులు దొరకటం లేదని ఆటోమొబైల్ వ్యాపారులు అన్నారని చెప్పారు. రూ. 2400 కోట్ల వ్యయంతో 65 ఎటిసిలను ఏర్పాటు చేశామని, ఒక్కొక్క ఎటిసిలో దాదాపు 200 మంది ప్రవేశాలు పొందుతున్నారని తెలియజేశారు.
ఎటిసిల్లో శిక్షణ పొందుతున్న అందరికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో మరో 51 ఎటిసిలను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎటిసి శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని, విదేశీ ఉద్యోగాలకు పాస్ పోర్టు, వీసా ఇప్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, నెలకు రూ. 40 వేల నుంచి రూ. 4 లక్షల వేతనం పొందే ఉద్యోగాలు దొరుకుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
-
Home
-
Menu