హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్లోకి రానివ్వని హెడ్‌మాస్టర్

X
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాల వేసుకున్న 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాల లోనికి రాకుండా అడ్డుకున్నారు. మాలతీసి పాఠశాలకు రావాలని హుకుం జారీ చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్‌దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపై హెడ్‌మాస్టర్ దుర్బాషలాడటం హేయనీయం. హెడ్‌మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్ నాయకులు శ్యామ్‌లాల్, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
Next Story
-
Home
-
Menu
