తల్లి పాలలో యురేనియం!

తల్లి పాలలో యురేనియం!
X

తల్లి చనుపాలలో యురేనియం.. ఆ మాట వింటేనే జనం భయాందోళనలకు గురవుతున్నారు. బీహార్ లో పాలిచ్చే తల్లుల చను పాలలో యురేనియం ఉన్నట్లు ఒక అధ్యయనం లో వెల్లడి కావడంతో ఆందోళన వ్యక్తమైంది. కాగా, ఈఅంశంపై అంతగా భయపడాల్సిన అవసరం లేదని సీనియర్ శాస్త్రవేత్త, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ డిఎం ఏ) సభ్యుడు భరోసా ఇచ్చారు. ఈ అధ్యయనం ఫలితాలు ప్రజారోగ్యానికి ఎటువంటి హాని కలిగించబోవని, బీహార్ నమూనాలలో కనుగొనబడిన యురేనియం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కన్నా చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ఎన్ డిఎంఏ సభ్యుడు, బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్ అయిన అణు శాస్త్రవేత్త డాక్టర్ దినేశ్ కె. అస్వాల్ ఓ ఇంటర్ వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అధ్యయనం ఫలితాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గుర్తించిన స్థాయి కన్నా పరిమితిలోనే ఉన్నాయన్నారు. వాస్తవానికి తాగునీటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉందన్నారు.

అధ్యయనం ఇలా

బీహార్ నుంచి వచ్చిన తల్లి పాల నమూనానలో 5 పిపిబి (పార్ట్స్ ఫర్ బిలియన్ ) వరకూ యురేనియం ఉన్నట్లు పట్నాసోని మహవీర్ క్యాన్సర్ సంస్థాన్, పరిశోధన కేంద్రం, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీహార్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు. అధ్యయనంలో ప్రధానంగా పాల్గొన్న ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ తెలిపినదాని ప్రకారం ఈ అధ్యయనం 40 మంది పాలిచ్చే తల్లుల పాలను విశ్లేషించింది. అన్ని నమూనాలలో యురేనియం (యు-238) ఉన్నట్లు తేలింది. 70 శాతం మంది శిశువులు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదాన్ని చూపించినప్పటికీ, మొత్తం యురేనియం స్థాయిలు అనుమతించిన పరిమితుల కన్నా తక్కువగా ఉన్నాయని డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. తల్లులు, శిశువులు ఇద్దరిపైనా కనీస వాస్తవ ఆరోగ్య ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలిక యురేనియం బహిర్గతం శిశువులపై చాలా హానికరమైన ఆరోగ్య ప్రభావాలను చూపుతుంది. బీహార్ అధ్యయనం ఫలితాలు శిశువు ఆరోగ్యం పై వాస్తవ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. మహిళలు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story