ఒక యూనిట్ రక్తం వెనుక ఇంత ఖర్చు ఉంటుందా?

Such a high cost behind a single unit of blood?
X

Such a high cost behind a single unit of blood?

“రక్తం దానం చేసినప్పుడు ఉచితంగానే వస్తుంది కదా… మరి రక్తం కోసం ఎందుకు డబ్బులు చెల్లించాలి?” అనే సందేహం చాలామందికి ఉంటుంది. కానీ రక్తదాత ఉచితంగా రక్తాన్ని దానం చేయడం ఒక విషయం; ఆ రక్తాన్ని సురక్షితంగా సేకరించి, పరీక్షించి, నిల్వ చేసి, అవసరమైన రోగికి అందించడం మరో విషయం.ఒక యూనిట్ రక్తం సేకరించిన వెంటనే రోగికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండదు. దాని వెనుక అనేక దశలు ఉంటాయి.

రక్త సేకరణ.....రక్తదాతకు ముందుగా ఆరోగ్యపరీక్ష, హీమోగ్లోబిన్ వంటి ప్రాథమిక పరీక్షలు చేస్తారు. రక్తాన్ని సేకరించడానికి ప్రత్యేకమైన స్టెరైల్ బ్లడ్ బ్యాగ్, సూది, ట్యూబులు, ఇతర వైద్య పరికరాలు అవసరం. తప్పనిసరి రక్త పరీక్షలుసేకరించిన ప్రతి యూనిట్ రక్తాన్ని రోగికి ఇవ్వడానికి ముందు పలు పరీక్షలు చేయాలి. రక్తగ్రూప్ నిర్ధారణతో పాటు, రక్తం ద్వారా వ్యాపించే కొన్ని ముఖ్యమైన అంటువ్యాధుల కోసం పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో సాధారణంగా హెచ్ ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్ వంటి పరీక్షలు ఉంటాయి.ఈ పరీక్షలకు రియాజెంట్లు, యంత్రాలు, నాణ్యత నియంత్రణ, సాంకేతిక సిబ్బంది వంటి వాటికి ఖర్చు అవుతుంది.

రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేయడం...రక్తాన్ని సేకరించిన తర్వాత సరైన ఉష్ణోగ్రతలో, నిర్దిష్ట నిబంధనల ప్రకారం నిల్వ చేయాలి. ఇందుకోసం ప్రత్యేక బ్లడ్ బ్యాంక్ రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లు, ఉష్ణోగ్రత పర్యవేక్షణ వ్యవస్థలు అవసరం.అంతేకాదు, రక్తాన్ని అవసరమైన చోటుకు సురక్షితంగా తరలించడానికి కూడా ప్రత్యేకమైన కోల్డ్-చైన్ నిర్వహణ అవసరం. ఒక యూనిట్‌తోనే ముగిసిపోదురక్తాన్ని అవసరాన్ని బట్టి ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్లు వంటి భాగాలుగా విడదీసి పలువురు రోగులకు ఉపయోగించవచ్చు. ఇందుకోసం ప్రత్యేక పరికరాలు, సిబ్బంది, నిల్వ సౌకర్యాలు అవసరం.అంటే ఒక రక్తదాత ఇచ్చిన రక్తం వెనుక సేకరణ నుంచి పరీక్షలు, ప్రాసెసింగ్, నిల్వ, నాణ్యత నియంత్రణ, రోగికి సరైన రక్తం/భాగం అందించే వరకు ఒక పెద్ద వైద్య వ్యవస్థ పనిచేస్తుంది.

మరి రక్తానికి ధర పెడుతున్నారా?...ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి.రక్తదాత దానం చేసిన రక్తానికి “ధర” నిర్ణయించడం కాదు. రక్తాన్ని సేకరించడం, పరీక్షించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, భద్రంగా రోగికి అందించడం వంటి సేవలకు అయ్యే నిర్వహణ/ప్రాసెసింగ్ ఖర్చులు ఉంటాయి.అందుకే బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఉచితంగా దానం చేసినప్పటికీ, దాన్ని సురక్షితంగా రోగికి అందించే ప్రక్రియకు ఖర్చు ఉండటం సహజం.

రక్తదానం మహాదానం… కానీ దాని వెనుక వ్యవస్థ కూడా అవసరమే!...ఒక రక్తదాత ఇచ్చే ఒక యూనిట్ రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం కల్పిస్తుంది. అయితే ఆ రక్తం రోగికి సురక్షితంగా చేరే వరకు పనిచేసే వైద్య సిబ్బంది, పరీక్షా కేంద్రాలు, పరికరాలు, బ్లడ్ బ్యాంకులు, నిల్వ వ్యవస్థలు—ఇవన్నీ కూడా అవసరమే.కాబట్టి రక్తదానం ఉచితం కావచ్చు… కానీ సురక్షితమైన రక్తాన్ని సేకరించి, పరీక్షించి, నిల్వ చేసి, రోగికి అందించే మొత్తం వైద్య ప్రక్రియ మాత్రం ఖర్చుతో కూడుకున్నదే.రక్తదానం చేద్దాం… ప్రాణాలను కాపాడుదాం.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎమ్ ఎస్ ఎమ్ సి హెచ్

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులుప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Tags

Next Story