అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతారు... అప్పుడు ఏమి చేయాలి?

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ, మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! అమెరికాలో ప్రతి సంవత్సరం 3,25,000 మంది ఇలా చనిపోతారు.
ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన వాటిలో ఉన్నాయి
1. గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు.. గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవడం
2. హెచ్ సిఎం హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి, 3. అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ
4. ఎంవిపి మైట్రల్ వాల్వు ప్రొలాప్సు
5. అరిథమిక్ ధోరణి
6. క్యుటిసి పొడిగించే డ్రగ్స్ వినియోగం
7. సొంతవైద్యంతో వాడే మందులు మరియు సప్లిమెంట్లు
8. తీవ్రమైన వ్యాయామం తర్వాత నిర్జలీకరణ స్థితి అనగా డీహైడ్రేషన్ బాధ్యత వహిస్తుంది
చాలా మరణాలు అరిథమిక్ విఎఫ్ వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ విటి వెంట్రికులార్ టాకీకార్డియా వలన వస్తాయి. కాకపోతే కొన్ని ఎసిఎస్ అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్సు అనగా గుండె రక్తనాళాలలో కొవ్వు చేరుకోవడం వల్ల వచ్చే కొరోనరీ స్పాజమ్ కావచ్చు. కొందరిలో ఆంజైనా నొప్పి వచ్చి పరీక్షలుకు సమయం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు.
ఎక్కువ వ్యాయామం, జిమ్ ప్రోగ్రామ్‌కు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుంటే ముందు సరైన కార్డియాక్ చెకప్ పొందడం వివేకంతో కూడిన చర్య. ఈ పరీక్షలు మీకు రిస్కు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 సంవత్సరాలు దాటిన వారు చేసుకోవచ్చు.
1. ఇసిజి
2. (ఎకో) కార్డియో గ్రామ్
3. టెస్ట్ ట్రెడ్ మిల్ టెస్టు అధిక ప్రమాదం ఉన్న వారిని పరీక్షించడానికి గుర్తించడానికి సరిపోతుంది.
కాని కొరోనరీ ఆర్టరీలో కొవ్వు చేరుకోవడం అదే కొలెస్టెరాల్ చేరుకోవడం వలన ప్లాక్ లు వస్తాయి. ఇవి వంశపారంపర్యంగా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రెలీమియా అంటారు. కొందరు హోమోసిస్టిన్ పెరిగిన వారిలో 20 ఏళ్ళనుంచే హార్ట్ ఎటాక్ లు వస్తాయి. ఈ కొలెస్టెరాల్ ప్లాక్ రప్చర్ అయితే దాని మీద ప్లేట్ లెట్సు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలవతుంది. ఆ ప్లాక్ పుండయితే దానిమీద సడన్ గా ప్లేట్ లెట్లు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలయితే ఓ అరగంటలో బ్లాక్ అయి హార్ట్ అటాక్ వస్తుంది. మనం ఆ క్లాటింగ్ ను అడ్డుకోవాలంటే ఆస్పిరిన్ 375 ఎంజి రెండు టాబ్లెట్లు లేదా ఎకోస్పిరిన్-75 ఎంజి 4 టాబ్లెట్ లు నమలాలి. నోటినుంచే లాలాజలం ద్వారా శరీరంలోకి వెళ్లిపోతుంది. క్లాటింగును ఆపి ప్రాసెస్ ను కొంత సేపు ఆపుతుంది.
ధూమపానం, మద్యపానం, మధుమేహం, బిపి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కెలోరీల కార్బోహైడ్రేట్ ఆహారం, విపరీతమైన పని ఒత్తిడి, స్ట్రెస్సు గుండె నొప్పులకు కారణాలు. అపుడపుడు 40 సంవత్సరాలయిన తరవాత పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే మందులు, నియంత్రణ చేసుకోవాలి
కొందరు హైరిస్కు ఉన్నవారు సిటి ఎంజియోగ్రామ్ 5 ఏళ్ళకొకసారి చేసుకోవాలి. రక్తనాళములలో బ్లాక్ తో పాటి కాల్షియమ్ స్కోరు తెలుస్తుంది లిపిడ్ప్రొఫైలు, బిపి, షుగరు సంవత్సరానికి ఒకసారైనా 35 ఏళ్ళ తరవాత చేసుకోవాలి. ట్రైగ్లిజరైడ్సు పెరిగితే ఫీనోఫైబ్రేట్ టాబ్లెట్, కొలెస్టురాలు పెరిగితే అటారవోస్టాటిన్ వేసుకోమంటారు. రెండు పెరిగితే కాంబినేషన్ ATOCOR+F వేసుకోమంటారు. దానితో పాటు ఎకోస్పిరిన్ 75ఎంజి వాడాలి.
సింకోపాల్ ఎటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు (మూర్ఛ), సింకోప్ చరిత్ర కలిగిన అభ్యర్థులు, ఆకస్మిక మరణం అనేది కుటుంబ చరిత్ర గల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెనొప్పి వస్తే రెండు ఆస్పిరిన్ టాబ్లెట్ లు నమిలి మింగాలి. దంచి నీళ్ళలో కలిపి తాగించి ఆసుపత్రి కి తీసుకెళ్ళాలి. లేకుంటే ఎంత పెద్దాసుపత్రి అయినా ప్రాణాలను కాపాడలేరు. అర్ధమైందిగా రెండు ఆస్పిరిన్ 375 ఎంజి మాత్రలే ప్రాణాలు కాపాడతాయి. మీ కోట్ల డబ్బు, పదవులు, అధికారాలు, పాపులారటీ, కార్పొరేట్ ఆసుపత్రులు కాదు. మనుషులను బ్రతికించాలంటే తప్పదు 2 ఆస్పిరిన్ గోలీలు, సిపిఆర్ చేయాలి. కారులో ఆసుపత్రికి తీసుకెళితే బతకడు. సిపిఆర్ చేస్తూ 108 పిలవాలి వారు డీపఫిబ్రిలేట్ చేసి సిపిఆర్ కొనసాగిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. రెండు ఆస్పిరిన్ 375 ఎంజి టాబ్లెట్ లు దగ్గర పెట్టుకోవాలి.
డాక్టర్ సి ప్రభాకర రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ సిటివిఎస్
గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు ఆంధ్రప్రదేశ్
Tags
-
Home
-
Menu
