మహారాష్ట్ర డిప్యూటీ సిఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం

X
ఎన్‌సిపి రాజ్యసభ సభ్యురాలు,దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. శనివారంనాడిక్కడి లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహాయుతి మంత్రులు, ఇతర నేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రాష్ట్రంలో ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం పగ్గాలను సునేత్ర చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
